సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ ఎదుట ‘ఆశ’ల ధర్నా
కై లాస్‌నగర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆశ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఫిక్స్‌డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి కలెక్టరే ట్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ప్రధా న ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్‌బెనిఫిట్స్ రూ.5లక్షలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శోభ, జిల్లా కార్యదర్శి సుజాత, ఆశ వర్కర్లు లక్ష్మి, మాధవి, స్వప్న, సురేఖ, ఉమా, మమత, హారిక, కవిత, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment