ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్‌నగర్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలి పారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మ డి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 18 మండలాల్లో 32 కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు తెలిపారు. వీటి పరిధిలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 16,417 మంది ఓ టర్లు ఉన్నారని పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా ను తప్పిదాలకు తావులేకుండా పక్కాగా రూపొందిస్తునట్లు తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగే పో లింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినో ద్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా
Comments
Please login to add a commentAdd a comment