వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Sun, Feb 2 2025 12:16 AM | Last Updated on Sun, Feb 2 2025 12:17 AM

వాతావ

వాతావరణం

ఆకాశం కొంత మేర వేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది.

– వివరాలు IIలోu

ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

భారీ ఊరట

బడ్జెట్‌లో ఆదాయపన్ను పరంగా రూ.12లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. దీనిపై ప్రభుత్వానికి ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తుండగా ఇప్పటికి స్పందించారు. అలాగే మూడు స్లాబ్‌లకు కుదించడం కూడా మంచి పరిణామమే. లక్షలాది మందికి ఉపయుక్తంగా ఉంటుంది.

ఎస్‌.అశోక్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

బీమాలో ఎఫ్‌డీఐ సురక్షితమేనా?

కేంద్ర ప్రభుత్వం బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఈ బడ్జెట్‌లో వందశాతం అనుమతించింది. దేశ ప్రజల డబ్బులకు ఏ విధంగా ఇది సురక్షితమో ఆలోచించాలి. గతంలో ఇలాగే బీమాకు అనుమతులు ఉండేవి. అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 1956లో ప్రభుత్వమే ఎల్‌ఐసీని తీసుకువచ్చింది. మళ్లీ అలాంటివి పునరావృతం కావని ప్రభుత్వం

చెప్పగలుగుతుందా. – మహేందర్‌బాబు,

ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, ఆదిలాబాద్‌

ఉడాన్‌ సేవలు కల్పించాలి

కేంద్ర ప్రభుత్వం టైర్‌ 2 పట్టణాల్లో ఉడాన్‌ సేవలు కల్పిస్తామని చెబుతున్న దృష్ట్యా ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ మధ్యన ఇక్కడి నుంచి విమాన సేవలు అందుబాటులోకి వస్తే వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

– లోక ప్రవీణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత

ప్రగతిశీల బడ్జెట్‌

ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రగతిశీల బడ్జెట్‌. సంక్షేమ పథకాల పరంగా రాష్ట్రానికి, జిల్లాకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆదాయ పన్ను పరిమితి పెంచడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. బడ్జెట్‌పై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

గోడం నగేశ్‌, ఎంపీ, ఆదిలాబాద్‌

అన్నివర్గాల ప్రజలకు లబ్ధి

కేంద్ర బడ్జెట్‌ అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూ పొందిస్తారు. ఇది దేశ అభ్యున్నతికి దోహదపడేలా ఉంది. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో చదివినప్పుడు కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తారు. పూర్తి రిపోర్టులో వివరంగా ఉంటాయి. జిల్లాకు కూడా అనేక సంక్షేమ పథకాల పరంగా లబ్ధి చేకూరనుంది.

– పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

మరోసారి భంగపాటే

కేంద్ర బడ్జెట్‌ జిల్లా ప్రజలకు మరోసారి భంగపాటు కలిగించింది. నవోదయ పాఠశాలలు జిల్లాలో ఒక్కటి కూడా లేదు. ఈ డిమాండ్‌ ఉన్నప్పటికి పట్టించుకోలేదు. జిల్లాలో రైల్వేలైన్‌, ఏయిర్‌పోర్టు విషయాలను కేంద్రం విస్మరించింది. రైతులు, యువతకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు లేవు.

– అనిల్‌ జాదవ్‌, ఎమ్మెల్యే, బోథ్‌

ఎన్నికల రాష్ట్రాలకే ప్రాధాన్యత

ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఉంది. రాష్ట్రాన్ని , జిల్లాను మరోసారి విస్మరించింది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదు.

– వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే, ఖానాపూర్‌

పంచాయతీలకు నిధులొచ్చాయ్‌

రూ.3.74 కోట్లు విడుదల

తీరనున్న సిబ్బంది వేతన వెతలు

కైలాస్‌నగర్‌: గ్రామ పంచాయతీ కార్మికుల కు కొద్ది నెలలుగా రెగ్యులర్‌గా వేతనాలు రావడం లేదు. ముఖ్యంగా చిన్న గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణం. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కార్మికులు ఇటీవల నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. జిల్లాలోని 473 గ్రామ పంచాయతీలకు గాను రూ.3కోట్ల 74లక్షల 68వేల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వీటిని కేవలం పంచాయతీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. నిధుల విడుదలతో జిల్లాలోని 1,511 మంది మల్టీ పర్పస్‌ వర్కర్ల వేతన వెతలు తొలగిపోనున్నాయి.

మున్సిపల్‌ మేనేజర్‌గా స్వామి

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ మేనేజర్‌గా స్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం అదే హోదాలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి బదిలీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన కమిషనర్‌ సీవీఎన్‌.రాజును మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అలాగే రెవెన్యూ అధికారిగా పనిచేసిన జాదవ్‌ కృష్ణ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ఇన్‌చార్జి ఆర్‌వోగానూ ఆయన బాధ్యతలు స్వీకరించారు.

సాక్షి, ఆదిలాబాద్‌: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో 2025–26కు సంబంధించి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ ఉంద ని బీజేపీ పేర్కొంటుంది. జిల్లాకు ఒనగూరే ప్రత్యేక ప్రయోజనాలు కనిపించడం లేదని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు విమర్శిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా పథకాలకు సంబంధించి ప్రకటించిన కేటాయింపులు జిల్లాకు కూడా ప్రయోజనం కలిగిస్తాయని కమలం పార్టీ స్పష్టం చేస్తోంది. డిటెయిల్‌ రిపోర్టులో బడ్జెట్‌ వివరాలు పూర్తిగా ఉంటాయని వివరిస్తోంది. మరో పక్క ఆదాయపన్ను మినహాయింపుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్య తరగతి ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితి పెంపుతో రైతుకు ఊరట లభిస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

అన్నదాతకు ప్రయోజనం కలిగేనా...

పత్తిపంటకు ప్రోత్సాహకాలు ఇస్తామని బడ్జెట్‌లో పేర్కొనడం జిల్లా రైతాంగానికి ఊరటనిచ్చేఅంశం. ఇక కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు పెంచడంతో పాటు కొత్త కార్డులు కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అలాగే కొత్తగా పీఎం ధన్‌ ధాన్య కృషి యో జన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుండగా దీని వల్ల జిల్లా రైతులకు ఏ మేరకు అవకాశం దక్కుతుందో చూడాల్సిందే.

ఉడాన్‌ సేవలు దక్కేనా ...

బడ్జెట్‌లో దేశంలోని 117 ప్రాంతాలకు విమాన సర్వీస్‌లను ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రారంభి స్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఏయిర్‌పోర్టు లేని ప క్షంలో ఏయిర్‌పోర్సు స్టేషన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. రక్షణశాఖకు చెందిన 367 ఎకరాల స్థలం జిల్లా కేంద్రంలో సిద్ధంగా ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు ఇక్కడి నుంచి కనీ సంగా ఎయిర్‌స్ట్రిప్‌ అయినా ప్రారంభించాలని పలు వురు కోరుతున్నారు. ఉడాన్‌ సేవలు జిల్లాకు ప్ర యోజనం కలిగిస్తాయా అనేది చూడాల్సిందే.

ఈవీ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం ...

ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు మరింత ప్రోత్సాహం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. లిథియం బ్యాటరీపై పన్ను తొలగించడం ద్వా రా ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ మరిన్ని ఈవీ వాహనాల కొనుగోలుకు జనం ఆసక్తి చూపే అవకాశాలున్నాయి.

ఊరట నిచ్చిన ఆదాయపు పన్ను

ఈ బడ్జెట్‌లో రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇవ్వడంతో జిల్లాలోని ఉద్యోగులు, వేతనజీవులు, మధ్యతరగతి జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్యాన్సర్‌ రోగులకు ఊరట

క్యాన్సర్‌ ఔషధాల ధరలు తగ్గించడం మంచి పరిణామం. బడ్జెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయం ఆ రోగులకు ఊరట కలిగిస్తోంది. కిమోథెరపీ చేసిన ప్రతీసారి ఇంజక్షన్లకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు రోగులు వెచ్చిస్తారు. ఈ క్రమంలో కేంద్ర నిర్ణయం పేషెంట్లకు మేలు చేసేలా ఉంది.

– జక్కుల శ్రీకాంత్‌, క్యాన్సర్‌ వైద్యనిపుణులు, రిమ్స్‌

పరిమితి పెంపుతో రైతులకు మేలు

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణ పరిమితి రూ.5లక్షలకు పెంచడంతో రైతులకు మేలు చేకూరనుంది. గతంలో ఎంత భూమి ఉన్నా రుణం రూ.3లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఆపై రుణం పొందాలంటే రైతులు తమ సాగుభూమిని తనఖా పెట్టే పరిస్థితి ఉండేది. తాజా నిర్ణయంతో అన్నదాతకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.

– సర్సన్‌ భూమారెడ్డి, రైతు, జామిడి

కంప్యూటర్‌ విద్యతో ప్రయోజనం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతీ విద్యార్థికి కంప్యూటర్‌ విద్య అవసరం. అయితే బడ్జెట్‌లో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తామని పేర్కొనడం శుభసూచకం.

– డొంగరి వంశీ, ఉపాధ్యాయుడు, జెడ్పీఎస్‌ఎస్‌, సొనాల

న్యూస్‌రీల్‌

కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందన్న బీజేపీ

జిల్లాకు ప్రత్యేక ప్రయోజనాలు లేవంటున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

ఆదాయపు పన్ను మినహాయింపుపై వేతన జీవుల హర్షం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితి పెంపుతో అన్నదాతకు ఊరట

No comments yet. Be the first to comment!
Add a comment
వాతావరణం
1
1/11

వాతావరణం

వాతావరణం
2
2/11

వాతావరణం

వాతావరణం
3
3/11

వాతావరణం

వాతావరణం
4
4/11

వాతావరణం

వాతావరణం
5
5/11

వాతావరణం

వాతావరణం
6
6/11

వాతావరణం

వాతావరణం
7
7/11

వాతావరణం

వాతావరణం
8
8/11

వాతావరణం

వాతావరణం
9
9/11

వాతావరణం

వాతావరణం
10
10/11

వాతావరణం

వాతావరణం
11
11/11

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement