ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి
బజార్‌హత్నూర్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. స్థానిక తహసీల్దార్ శంకర్ పదవీ విరమణ కా ర్యక్రమం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు. పదవీ వి రమణ వయసుకే తప్ప సేవకు కాదని తెలిపా రు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మాట్లాడు తూ ఉద్యోగ జీవితంలో చేసిన సేవలను లబ్ధి పొందిన ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటార ని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, ఎస్డీసీ గంగాధర్, ఏవో రాంరెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, కవితారెడ్డి, సత్యనారాయణ, సుభాష్‌చందర్, రాజమనోహర్, తుకారాం, ప్రవీణ్, నాయబ్ తహసీల్దార్ హరిలాల్ తది తరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment