ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్లో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, సురేందర్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే బడ్జెట్‌లో ఆదాయపన్ను పెంపు పరిమితి పెంపుపై త పస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సు నీల్ చవాన్, వలబోజు గోపీకృష్ణ మరో ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇది వేతన జీవులకు ఎంతో ఊరట కలిగించే నిర్ణయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment