పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కై లాస్‌నగర్: సమాజంలోని అట్టడుగుస్థాయిలోని పేదలకు తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నాలుగు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రవీంద్రనగర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు వార్డు పరిధిలోని ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా చదివి వినిపించారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల వరకే పార్టీలన్నారు. గెలిచాక అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే అన్ని పార్టీలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే పేదలకు ఇళ్లురావని, స్థలం లేని వారికి కూడా ఇంటిని నిర్మించి ఇచ్చేలా చూడాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరినట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండ్రత్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment