● అర్హులమైనా జాబితాలో ఎందుకు లేదు.. ● తొలిరోజు గ్రామసభల
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినో త్సవం నుంచి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కొత్త రేష న్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారు. మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో గ్రామసభలను ప్రారంభించారు. ప్రత్యేక అధికారులతో పాటు మండల అధికారుల ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు ఈ సభలు కొనసాగాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో తొలిరోజు ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణంలోని కొన్ని వార్డుల్లో నిర్వహించారు. శుక్రవారం వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇంద్రవెల్లి మండలం సమాక గ్రామంలో కలెక్టర్ రాజర్షిషా గ్రా మసభలను ప్రారంభించారు. అదే మండలంలోని పిప్రి, ఉట్నూర్ మండలం ఉమ్రి సభల్లోనూ పాల్గొన్నారు. ఆయా సభల్లోనూ పలువురు తమ పేర్లు లేవని, తాము అర్హులమైనప్పటికీ ప్రయోజనం దక్కడం లేదంటూ వాపోయారు. దీంతో కలెక్టర్ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు.
మళ్లెందుకు దరఖాస్తు చేసుకోవాలనే ప్రశ్న..
మొదటి రోజు జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో పలుచోట్ల ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల కోసం పలువురి నుంచి ఆందోళన వ్యక్తమైంది. రైతు భరోసా విషయంలో అంతగా కనిపించలేదు. తాము అర్హులమైనప్పటికీ జాబితాలో చోటెందుకు కల్పించలేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీనికి వారు మళ్లీ తామెందుకు దరఖాస్తు చేసుకోవాలనే ప్రశ్నను లేవనెత్తారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఆయా పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి సర్వే చేసి ఆ డాటాను పూర్తిగా నమోదు చేసినట్లు పలువురు ఆయా సభల్లో పేర్కొన్నారు. డేటా మొత్తం ప్రభుత్వం వద్దే ఉన్నప్పుడు ఆ ప్రకారంగా మాకు జాబితాలో చోటు కల్పించాల్సి ఉండగా, మా పేర్లు ఎందుకు లేవంటూ పలువురు నిలదీయడం కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వద్ద డేటా, సర్వే విషయంలో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిరికొండ మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఎల్‌పీవో ఫణిందర్, ఎంపీడీవో రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంపికై న 86 మంది లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అయితే గ్రామసభలో పాల్గొన్నవారు ‘మేము కూడా అర్హులమే’ మా పేర్లు ఎందుకు లేవు.. ఈ సర్వే ఏ ప్రకారం చేశారు. ఏ ప్రాతిపదికన ఆ జాబితా విడుదల చేశారు. మాకు కూడా భూమి లేదు. ఉపాధి జాబ్ కార్డు ఉంది. 20 రోజుల కూలీ పని చేశాం. మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటూ అధికారులను నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment