నాల్గో తరగతి ఉద్యోగుల జిల్లా కార్యవర్గం రద్దు
కై లాస్‌నగర్: తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవన అద్దెల విషయంలో చోటు చేసుకున్న అక్రమాలను వివరిస్తూ గతేడాది డిసెంబర్ 11న ‘నాయకా.. అక్రమాలు చాలిక’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్ సంఘం అద్దెలపై విచారణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఎల్.దాస్యనాయక్, కె.రామస్వామి, ఏ.భిక్షమయ్యతో కూడిన ఆ కమిటీ జిల్లా కేంద్రంలో పర్యటించింది. సంఘ భవనానికి వస్తున్న అద్దె, నిల్వ ఉన్న నిధులు, చేసిన ఖర్చులపై విచారణ చేపట్టింది. జిల్లా కార్యదర్శి ఇందిర, సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి కె.గంగాధర్‌తో పాటు సంఘం మడిగెల్లో అద్దెకు ఉంటున్న వ్యాపారులను విచారించి వారి సంతకాలు కూడా సేకరించారు. మడిగెల అద్దెలు రూ.30లక్షలు, అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.7లక్షల వివరాలు క్యాష్‌బుక్‌లో నమోదు చేయలేదని, బ్యాంకు అకౌంట్‌లో కూడా లేవని, వాటి మినిట్స్ బుక్ కూడా అందుబాటులో లేనట్లుగా నిర్ధారించిన కమిటీ సభ్యులు సంఘం కేంద్ర అధ్యక్షుడికి నివేదిక అందజేశారు. దాని ఆధారంగా 2024లో నియామకమైన సంఘం జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఆయన మంగళవారం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment