అర్హులందరికీ సంక్షేమ పథకాలు●
● కలెక్టర్ రాజర్షిషా
ఇంద్రవెల్లి: ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేందుకే గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని సమాక, పిప్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేల ఆధారంగా అర్హులను గుర్తించామన్నారు. ఒకవేళ అర్హులైనా జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు సూ చించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉమ్రీలో..
ఉట్నూర్‌రూరల్: మండలంలోని ఉమ్రీలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, జిల్లాలో తొలిరోజు 113 చోట్ల గ్రా మసభలు నిర్వహించినట్లు తెలిపారు. అంతకముందు మండలంలోని ఎక్స్‌రోడ్డు సమీపంలో గల లాల్‌టెక్డీలోని గిరిజన గురుకుల జూని యర్ కళాశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో రాం ప్రసాద్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment