ఉత్సాహంగా ‘ఏకలవ్య’ క్రీడా పోటీలు
అరకులోయ టౌన్ : స్థానిక ఏపీ గురుకుల క్రీడా పాఠశాల మైదానంలో రాష్ట్రస్థాయి 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్) స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గురుకులం కోఆర్డినేటర్, అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్ మూర్తి అధ్యక్షత వహించిన ఈ పోటీలను గురుకులం ఓఎస్డీ రఘునాథ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, కోకో, ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, జూడో, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, జావలిన్ త్రో, పోలో వాల్ట్, త్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, షాట్ పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ 800, 1500, 4000 మీటర్ల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో గురుకులం కోఆర్డినేటర్, అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురుకులం అసిస్టెంట్ సెక్రటరీ హరి, అరకులోయ ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు డాక్టర్ కె. భరత్ కుమార్ నాయక్, పట్టాసి చలపతిరావు, ఈఎంఆర్‌ఎస్ ప్రిన్స్‌పాళ్లు, కోచ్‌లు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
డేవిడ్‌కు అభినందన
● ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్ట్ జూనియర్ మ్యూజిక్ కల్చరల్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచిన అనంతగిరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి మాస్టర్ సొనాయి డేవిడ్, తండ్రి కామేశ్వరరావును గురుకులం ఓఎస్డీ రఘునాథ్ జ్ఞాపిక అందజేసి సత్కరించారు. డేవిడ్‌లను ఈఎంఆర్‌ఎస్ ప్రిన్స్‌పాళ్లు అభినందించారు.
విజేతలు వీరే : 800 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో చింతూరు ఈఎంఆర్‌ఎస్‌కు చెందిన కిరణ్ ప్రథమ స్థానం, అనంతగిరి ఈఎంఆర్‌ఎస్‌కు చెందిన రాఘవ ద్వితీయ స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో చింతూరుకు చెందిన అంకిత, అమృత, మారేడుమిల్లికి చెందిన మౌనిక మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment