108లో సుఖ ప్రసవం
పాడేరు : ప్రసవానికి ఇబ్బందులు ఎదురై అత్యవసరంగా విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తున్న ఓ నిండు గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. పెదబయలు మండలం రూడకోట గ్రామానికి చెందిన కె.కుంచలమ్మ అనే మహిళ నిండు గర్భిణీ. పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ఆమె ప్రసవానికి ఇబ్బందులు ఎదురవడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రసవానికి మరింత ఇబ్బందులు ఎదురైంది. అత్యవసరంగా విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో 108 వాహనంలో విశాఖపట్నం తరలిస్తుండగా మార్గమద్యంలో వడ్డాది వద్ద ఆమెకు పురిటి నొప్పులు అధికమవడంతో వాహనాన్ని రహదారి పక్కకు నిలుపుదల చేశారు. ఈఎంటీ లోకేష్, పైలెట్ లక్ష్మి గణపతి ఆమెకు సుఖ ప్రసవం చేశారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డను జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లి, బిడ్డను అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బందికి తల్లీ, కుటుంబ సభ్యులు కృతజ్నతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment