అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థిని మృతి
జి.మాడుగుల: అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూర్బా విద్యార్థిని విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కేజీబీవీ ఇన్చార్జి ఎస్వో మోదకొండమ్మ. తల్లి జ్యోతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోరాపల్లి పంచాయతీ వనల్భ గ్రామానికి చెందిన బట్టి జ్యోతి కుమార్తె పల్లవి జీఎం కొత్తూరులోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. చాలాకాలంగా ఆమె పాఠశాలకు రాకపోవడంతో కుటుంబ సభ్యులను ఫోన్లో ఉపాధ్యాయులు సంప్రదించారని ఇన్చార్జి ఎస్వో తెలిపారు. ఆరోగ్యం బాగులేదని వారు చెప్పడంతో కేజీబీవీ ఉపాధ్యాయులు ఈనెల 7న వనెల్భలోని విద్యార్థిని పల్లవి ఇంటికి వెళ్లారన్నారు. ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించాలని తల్లికి చెప్పి వచ్చారని ఆమె వివరించారు. ఈమేరకు పల్లవిని ఆమె తల్లి ఈనెల 8న స్థానిక పీహెచ్‌సీకి తీసుకువచ్చింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి, తరువాత విశాఖ కేజీహెచ్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో అక్కడ పల్లవి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఇన్చార్జి ఎస్వో, కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment