మత్స్యసిరులు | - | Sakshi
Sakshi News home page

మత్స్యసిరులు

Published Thu, Nov 21 2024 1:49 AM | Last Updated on Thu, Nov 21 2024 1:49 AM

మత్స్

మత్స్యసిరులు

మంచి ఆదాయంపొందుతున్నా..
ఒకప్పుడు గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆదాయం పొందేవారు. స్థానికంగా వాగులు, గెడ్డల్లో చేపల వేట సాగించగా వచ్చే అరకొర ఆదాయంతో కాలం గడిపేవారు. ఇప్పుడు వారిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం అందించే ప్రోత్సాహంతో స్థానికంగా అందుబాటులో ఉన్న జలవనరుల్లో మత్స్య పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయించే స్థాయికి మత్స్యకార మహిళలు ఎదుగుతూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నేడు ప్రపంచ మత్స్య దినోత్సం సందర్భంగా...
జలవనరుల్లో

చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, అప్పడాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై పందిరిమామిడి కృషి విజ్ఞానకేంద్రంలో 2023 లో శిక్షణ పొందా. ఆ తరువాత సొంతంగా విలువఆధారిత ఉత్పత్తుల తయారీ ప్రారంభించా. ప్రతీ నెల సుమారు రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టి చేపలు, రొయ్యలతో పచ్చళ్లు తయారు చేస్తున్నా. తన వద్ద కొంత మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.పెట్టుబడి పోను నెలకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా మార్ట్‌లో విక్రయించే అవకాశం కల్పించారు. – సీహెచ్‌ శ్రీదేవి,

గిరిజన మహిళ, రంపచోడవరం

కేవీకే సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న గిరిజన మత్స్యకారులు

రంపచోడవరం: చేపలు, రొయ్యల పెంపకంతోపాటు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి గిరిజన మత్స్యకారులు మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా ఉన్న సాగునీటి చెరువులు, భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్దిగెడ్డ, దెమ్మలగుమ్మి జలాశయాల్లో వీటి పెంపకం చేపట్టి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. వీరికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలోని మత్స్య విభాగం అందజేస్తోంది.

● భూపతిపాలెం, ముసురుమిల్లి రిజర్వాయర్‌లో కేజ్‌ కల్చర్‌ ద్వారా బొచ్చ, రవ్వ, మోస, ఫంగస్‌ రకం చేపల పెంపకం చేపట్టి గిరిజన మత్స్యకారులు ఫలితాలు సాధించారు. ఈ ఏడాది ఆరు టన్నుల మేర చేపలను ఉత్పత్తి చేశారు. స్థానికంగానే విక్రయించి మంచి ఆదాయం పొందారు.

● కేవీకే సహకారంతో మొదటిసారిగా మంచినీటి రొయ్య పిల్లల పెంపకాన్ని మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో చేపట్టారు. సిఫా విడుదల చేసిన మంచినీటి రొయ్య రకం మంచి దిగుబడి వచ్చింది. కిలోకు 10 కౌంట్‌ (పది రొయ్యలు) వచ్చినట్టు కేవీకే మత్స్యవిభాగం అధికారవర్గాలు తెలిపాయి. ఎకరాకు 500 నుంచి 600 కిలోలు దిగుబడి రావడంతో గిరిజన మత్స్యకారులు మంచి ఆదాయం పొందారు. గత మూడేళ్లలో ఏడాదికి 40 వేల చొప్పున 1.20 లక్షల రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు.

● మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న కొరమేను చేపల పెంపకంలో కూడా మంచి ఫలితాలు సాధించారు. వీటిని వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటంతో కేవీకే ప్రోత్సహించింది. మొదటి సారిగా అమూర్‌ కార్పొరకం పెంపకం చేపట్టారు. సాధారణం రకం కంటే 25 శాతం పెరుగుదల వచ్చింది.

● చేప పిల్లల విషయానికొస్తే 2022లో 60 వేలు, 2023లో 70 వేలు, 2024లో 1.50 లక్షలు కేవీకే ఉచితంగా పంపిణీ చేసింది.

● చేపలు, రొయ్యల పెంపకంపై ఏమాత్రం అవగాహన లేని గిరిజన మత్స్యకారులకు పందిరి మామిడి కృషి విజ్ఞానకేంద్రం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడేళ్లలో వెయ్యి మందికి 30 శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసింది. వీటిలో చేపలు, రొయ్యల పెంపకంలో యాజమాన్యం, ఆదాయ వివరాలపై ఇప్పటికే వారు అవగాహన పొందారు. ఏటా చేపల వల వలలు పంపిణీ చేయడంతోపాటు పోషక విలువలతో కూడిన దాణాను ఉచితంగా అందజేస్తోంది.

● చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై గిరిజన మత్స్యకార మహిళలు పందిరిమామిడి కేవీకేలో శిక్షణ పొందారు. పచ్చళ్లు, చేప కట్‌లెట్స్‌, ఒడియాలు, చేప బాల్స్‌, మురుకులు, అప్పడాలు, సమోసా, ఫిష్‌ ఫింగర్లు తయారు చేసే స్థాయికి ఎదిగారు. నెలకు రూ.25 నుంచి రూ.35 వేలకు పైగా ఆదాయం పొందుతున్నారు.

రంపచోడవరం డివిజన్‌ సమాచారం

గిరిజన మత్స్యకార సంఘాలు : 15

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు : 2

పంచాయతీ చెరువులు : 18

సాగునీటి చెరువులు : 15

జలాశయాలు : 5

నాడు అటవీ ఉత్పత్తులే ఆధారం

నేడు చెరువులు, జలాశయాల్లో

చేపల పెంపకం

సహకారం అందిస్తున్న శాస్త్రవేత్తలు

ఉచితంగా విత్తన పిల్లలు, దాణా పంపిణీ

అనుకూల వాతావరణ పరిస్థితులతో

మంచి దిగుబడి, ఆదాయం

విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేస్తూ ఆర్థికాభివృద్ధికి బాటలు

అధిక దిగుబడి సాధించా

కేవీకే శాస్త్రవేత్తలు మత్స్యకార గిరిజన రైతులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ ఏడాది కొత్త రకాల చేప పిల్లలను అందజేశారు. వీటి పెంపకాన్ని శ్రద్ధగా చేపట్టడంతో అధిక ఉత్పత్తిని సాధించగలిగా. చేపలు పెంపకానికి మేతను కూడా అందిస్తున్నారు. రైతులకు వద్దకు వచ్చి చేపల పెంపకంలో మెళకువలు చెబుతున్నారు. మంచి ఆదాయం పొందేందుకు అవసరమైన సమాచారం అందిస్తున్నారు.

– నంద మురళీకృష్ణ, చెరువుపాలెం,

రంపచోడవరం మండలం

పెంపకానికి ఎంతో అనుకూలం

ఏజెన్సీలో మంచి నీటి లభ్యత, సారవంతమైన భూమి ఉన్నందున చేపల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంది. గిరిజన మత్స్యకారులు చేపల పెంపకంలో అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంచి మార్కెటింగ్‌ ఉన్నందున బాగా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల రైతులు పందిరి మామిడి కృషి విజ్ఞాన కేంద్రంలోని తమ విభాగాన్ని సంప్రదించాలి.

– కె. వీరాంజనేయులు, మత్స్యశాఖ శాస్త్రవేత్త,

పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
మత్స్యసిరులు1
1/5

మత్స్యసిరులు

మత్స్యసిరులు2
2/5

మత్స్యసిరులు

మత్స్యసిరులు3
3/5

మత్స్యసిరులు

మత్స్యసిరులు4
4/5

మత్స్యసిరులు

మత్స్యసిరులు5
5/5

మత్స్యసిరులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement