సమస్యలు పరిష్కరించాలి
సాక్షి,పాడేరు: సమస్యలు పరిష్కరించాలని వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)లు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌సీ పాలసీ, రూ.10లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు జేయాలని, ఉపాధి కోల్పోయిన వీవోఏలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని జేసీ అభిషేక్ గౌడ్‌కు అందజేశారు. సీఐటీయూ ప్రతినిధులు రాజ్‌కుమార్,ఎస్‌బీ పోతురాజు.అధిక సంఖ్యలో యానిమేటర్లు పాల్గోన్నారు.
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ ఎదుట బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వీవోఏలు ధర్నా చేశారు. నిర్వహించారు.సీఐటీయూ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట భైఠాయించి నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ట వాణిశ్రీ , ఉపాధ్యక్షుడు కె శాంతిరాజు తదితరులు మాట్లాడారు. అనంతరం ఏపీవో డీఎన్‌వీ రమణకు వినతిపత్రం అందజేశారు.
చింతూరు: సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం డివిజన్లోని వీవోఏలు స్థానిక ఐటీడీఏ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, పొడియం లక్ష్మణ్, గొర్రె లక్ష్మయ్య, దూలమ్మ, దుర్గాదేవి, శ్రీను, లీలావతి, కొండమ్మ, జ్యోతి, రత్నకుమారి పాల్గొన్నారు.
వీవోఏల డిమాండ్
పాడేరు, రంపచోడవరంలో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment