తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ

Published Thu, Nov 21 2024 1:49 AM | Last Updated on Thu, Nov 21 2024 1:49 AM

-

సీలేరు: తప్పుడు కులధ్రువీకరణ పత్రాలపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టమని జీకేవీధి ఆర్‌ఐ మహదేవ్‌ తెలిపారు. సీలేరు సచివాలయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు నలుగురు పొందారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎంపీటీసీ సాంబమూర్తి, సర్పంచ్‌ దుర్జో, ఉప సర్పంచ్‌ వల్లీ ప్రసాద్‌ సమక్షంలో బుధవారం ఆయన విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని ఆ నలుగురికి సూచించినట్టు ఆర్‌ఐ తెలిపారు. దీనిపై తహసీల్దార్‌కు నివేదిక సమర్పిస్తామని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement