No Headline
● చలి.. చక్కిలిగిలి
దట్టమైన మంచు తెరలు.. ఆపై వణికించే చలి.. ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పినట్టుగా గ్రామాలు... శీతాకాలంలో మన్యంలో ఇవన్నీ సర్వసాధారణం. ఎముకలు కొరికే చలిలో గిరిజనులు దైనందిన జీవనంలో మమేకమవుతారు. ఇంటిల్లపాది వేకువజామున వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. గజగజ వణికించే చలిలో మహిళలు బోర్లు, వాగుల వద్దకు వెళ్లి నీటిని తీసుకుని వస్తుంటారు. వాహన చోదకులు హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి చలి తీవ్రత మొదలవడంతో చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతారు. ఇవన్నీ వారి శ్రమైక జీవనంలో భాగమే. – ముంచంగిపుట్టు
Comments
Please login to add a commentAdd a comment