వణుకుతున్న మన్యం
సాక్షి,పాడేరు: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం పది గంటలకు సూర్యోదయం అయింది. సాయంత్రం 4గంటల నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు నమోదైంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
శీతల గాలులతో..
చింతపల్లి: మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల మన్యం ప్రజలు వణికిపోతున్నారు. రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నాయి. అరకులోయలో శుక్రవారం 10.9 డిగ్రీలు , చింతపల్లిలో 13.2 డిగ్రీలు, పాడేరులో 13.4 డిగ్రీలు నమోదు అయినట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గూడెంకొత్తవీధిలో 12.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 12.0, జి.మాడుగులలో 11.0, ముంచంగిపుట్టులో 10.3, హుకుంపేటలో 12.7, పెదబయలులో 12.4, అనంతగిరిలో 11.1, కొయ్యూరులో 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు.
హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు
డుంబ్రిగుడ: మండలంలో చలి పంజా విసురుతోంది. వారం రోజులుగా ఉదయం 9.30 వరకు కురుస్తోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, పొలాలకు వెళ్లే గిరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అరకు నుంచి కించుమండ వరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించనంతగా శుక్రవారం మంచు దట్టంగా కురిసింది. హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు.
ముంచంగిపుట్టులో 10.3 డిగ్రీల కనిష్ట
ఉష్ణోగ్రతలు నమోదు
ఉదయం 10 గంటల వరకు
దట్టంగా కురుస్తున్న మంచు
Comments
Please login to add a commentAdd a comment