కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువు
పాడేరు : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి హైమవతి విమర్శించారు. ఇటీవల విశాఖపట్నంలో ఓ న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా శుక్రవారం పాడేరులో ఆదివాసీ గిరిజన మహిళా సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవిద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏదొక చోట మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. నిందితులకు సరైన శిక్ష పడకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో జన సంచారం ఉండే బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. పట్టణానికి దూరంగా దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆదివాసీ గిరిజన మహిళా సంఘం
జిల్లా కార్యదర్శి హైమవతి
విశాఖలో న్యాయ విద్యార్థినిపై
అత్యాచారానికి నిరసనగా ధర్నా
ఐటీడీఏ ఎదుట బైఠాయింపు
నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment