సమస్యల పరిష్కారానికి చొరవ తప్పనిసరి
పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి 98 అర్జీలను స్వీకరించారు. వీటిని సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్వో పద్మలత, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, ఆర్‌ఆండ్‌బీ, టీడబ్ల్యూ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు బాలసుందర్‌బాబు, వేణుగోపాల్, జి. డేవిడ్‌రాజు, జవహర్‌కుమార్, టీడబ్ల్యూ ఇంచార్జి డీడీ రజని, ఐటీడీఏ ఏవో హేమలత, డీఎల్పీవో పీఎస్ కుమార్ పాల్గొన్నారు. ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ రెండు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ఆయన ట్రాన్స్ జెండర్ల స్వయం సహాయక సంఘాన్ని ప్రారంభించారు. వీరికి స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
మీకోసంలో 98 వినతుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment