గిరిజనులకు అండగా ఉంటాం
● రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్
మారేడుమిల్లి : ఏజెన్సీలోని గిరిజనులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ అన్నారు. గుర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతకోట పంచాయతీలోని బడియా కొప్పులకోట, రెడ్డి కొప్పులకోట, జనమగుడా, పులుసు మామిడి, గంగనూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భగా ఆయా గ్రామాల గిరిజనులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి పండించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పులసుమామిడి, గంగనూరు పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు పుస్తకాలు, యువతకు వాలీబాల్ కిట్లు, స్ధానిక గిరిజన రైతులకు ఆకుకూరల విత్తనాలు, రగ్గులు పంపిణీ చేశారు. గిరిజనులతో కలిసి సామూహిక భోజనాలు చేశారు. మారేడుమిల్లి సీఐ గోపాల్ కృష్ణ, గుర్తేడు ఎస్ఐ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment