చింతపల్లి ఆస్పత్రిలో వైద్య నిపుణుల భర
చింతపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య నిపుణుల పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. ఆయన బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు. కొంత కాలంగా ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న పలు సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదులు అందడంతో జాయింట్ కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించి, విచారణ నిర్వహించారు.ఆస్పత్రిలో వైద్యాధికారుల పనితీరు, నిధుల ఖర్చు,వైద్యాధికారుల కొరత తదితర పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు.ప్రస్తుతం ఆస్పత్రిలో మత్తు వైద్యులు లేకపోవడంతో శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం లేకుండా పోయిందన్నారు. సీ్త్ర వైద్యనిపుణుల కొరత కారణంగా ప్రసవం ఇబ్బంది అయితే గర్భిణులను మైదాన ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ సమస్యలను అధిగమించేందుకు, వైద్య నిపుణుల ను నియమించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. చిన్నపిల్లలు వైద్య నిపుణులను కూడా నియమించనున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోవడంతో ఈ ప్రాంతవాసులు వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు అందేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు చర్యలు తీసు కుంటామన్నారు. విచారణ నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్టు జేసీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment