ప్రతి మండలంలో వంద ఫారంపాండ్స్
● ఐటీడీఏ పీవో అభిషేక్
పాడేరు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మండలంలో వంద ఫారంపాండ్స్ నిర్మాణానికి గ్రామాలను గుర్తించాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఆదేశించారు. పనులను వచ్చే నెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. బుధవారం డ్వామా ఆధ్వర్యంలో స్థానిక కాఫీ హౌస్లో ఉపాధి హామీ పథకం క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అభివృద్ధి పనుల నిర్వహణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన పనులను గుర్తించాలని సూచించారు. జాబ్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి పనులను కల్పించాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పీడీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment