మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కలెక్టర్ దినేష్‌కుమార్
మారేడుమిల్లి : గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. మారేడుమిల్లి మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. బోదులూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందులను అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఫీడర్ అంబులెన్స్‌ల పనితీరును పరిశీలించారు. ఆకుమామిడికోట సమీపంలోని రూ.3.20 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రెండు వంతెనలను, ఆకుమామిడికోట గ్రామంలోని జీపీఎస్, మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ పిల్లలకు పాలు, గుడ్లు, పౌష్టికాహారం రోజూ అందజేయాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి జన్మన్ పథకం ద్వారా పీటీజీల కోసం నిర్మిస్తున్న గృహాల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పర్యాటక ప్రాంతమైన గుడిసెను సందర్శించారు. ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటకులు అసాంఘిక కార్యకలపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ, గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస రావు, తహసీల్దార్ బాలాజీ, ఎంపీడీవో శ్రీనివాస విశ్వనాఽథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment