రెండు గంజాయి కేసుల్లో ఐదుగురి అరెస్టు
మోతుగూడెం: గంజాయికి సంబంధించి రెండు కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్టు డొంకరాయి ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన ఇందుకూరి త్రినాథ్, డీకొండ రాజేష్, రెళ్ల సాయికిరణ్, మరో బాలుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగలించి విక్రయిస్తుంటారు. ఆ మొత్తంతో గంజాయి కొనుక్కొని తాగి జల్సా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఈనెల 26న పాడేరు ప్రాంతంలో గంజాయి కొనుక్కొని రెండు బైక్‌లపై బయలుదేరారు. డొంకరాయి పోలీసుస్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడినట్టు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన నలుగురు గుంటూరు పరిసరి ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ విషయాన్ని గుంటూరు పోలీసులకు తెలియజేశామన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు, బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు ఆయన వివరించారు. ఇలావుండగా బుధవారం డొంకరాయి పోలీసుస్టేషన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రెండు కిలోల గంజాయి తరలిస్తూ ఇద్దరు పట్టుడినట్టు ఎస్‌ఐ తెలిపారు. బైక్‌పై వస్తున్న వీరిని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన వీపు వెంకటేష్, మరిగల మణికంఠగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డొంకరాయి రైటర్ శ్రీనివాస్‌గౌడ్, హెచ్‌సీ కల్యాణ్, పీసీ పోశయ్యలను చింతూరు ఏఎస్పీ సంజయ్‌కుమార్ మీనా అభినందించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
నిందితులు విజయవాడ,
జంగారెడ్డిగూడెం ప్రాంతీయులు
Comments
Please login to add a commentAdd a comment