పరిశుభ్రంగా చాపరాయి జలవిహారి
డుంబ్రిగుడ: చాపరాయి జలవిహారిని పరిశుభ్రంగా ఉంచాలని పాడేరు ఐటీడీఏ పీవో వి. అభిషేక్ పిలుపునిచ్చారు. గురువారం చాపరాయిలో జలవిహారి వద్ద స్వదేశి దర్శన్ 2.0 ప్రాజెక్టు కోఆర్డినేటర్ రతన్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత డ్రై సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశీ పర్యాటకులకు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని నిర్వహకులను ఆయన కోరారు. చిరు వ్యాపారాలు చేసే స్టాళ్ల వద్ద డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ వచ్చే వాహనాల పార్కింగ్‌కు నిర్వహిస్తామని పీవో తెలిపారు. చాపరాయి అభివృద్ధి తనకు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పీవో తెలిపారు. ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, డిప్యూటీ తహసీల్దార ముజీబ్, టూరిజం మేనేజర్ మేనేజర్ మరళి, పంచాయితీ కార్యదర్శి విజయ్, చాపరాయి నిర్వహకులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత :
ఐటీడీఏ పీవో అభిషేక్
అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యత తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ కోరారు. గురువారం ఆయన స్థానిక పద్మాపురం గార్డెన్‌ను సందర్శించారు. కార్మికులతో పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం అమలుకు కృషి చేయాలని ఆయన కోరారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పీవో సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. బేస్ లైన్ పరీక్షల ప్రకారం విద్యార్థులను ఏబీసీడ గ్రూపులుగా విభజించి సీ,డీ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధ చూపాలని సూచించారు. ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు, మ్యాజియం మేనేజర్ మురళి, పద్యాపురం గార్డెన్ మేనేజర్ బొంజిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్
నిర్వాహకులకు సూచన
Comments
Please login to add a commentAdd a comment