కొనసాగుతున్న గురుకుల ఉపాధ్యాయుల రిలే దీక్షలు
పాడేరు : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐటీడీఏ ఎదుట గిరిజన గురుకుల విద్యా సంస్థల ఔట్‌సోర్సింగ్ ఉపాద్యాయులు, అద్యాపకులు చేపడుతున్న రిలే దీక్షలు గురువారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సీపీఎం, ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసే మెగా డీఎస్సీ నుంచి గిరిజన గురుకులాల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. తక్షణమే ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలన్నారు. 13 రోజులుగా ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల రిలే దీక్షల వల్ల విద్యార్థులు చదువులు సాగటం లేదన్నారు. దీనివల్ల ఈ విద్యా సంవత్సరంలో గిరిజన గురుకుల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారికి సీపీఎం మద్దతుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొజ్జన్న, చిన్నారావు, దాస్, ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంబిడి నీలకంఠం, ప్రధాన కార్యదర్శి ఎం. శోభన్‌బాబు, ఉపాధ్యక్షుడు పి.ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావం తెలిపిన సీపీఎం, ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం
Comments
Please login to add a commentAdd a comment