రంగురాళ్లు తవ్వితే కేసులు
చింతపల్లి: అటవీశాఖ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు జరిపినా, ప్రోత్సహించినా కేసులు తప్పవని పెదవలస అటవీశాఖ రేంజ్ అఽధికారి శివరంజిని హెచ్చరించారు. జీకేవీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ సమీపంలో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రేంజర్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ రేంజ్ పరిధిలో సిగనాపల్లి, దొడ్డికొండ ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలను కొంతమంది వ్యాపారులు ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో రంగరాళ్ల తవ్వకాలు చేపడితే తీసుకునే చట్టపరమైన చర్యలపై సదస్సులో గిరిజనులకు అవగాహన కల్పించామన్నారు. అటవీ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు సంచరించినా తమకు సమాచారం అందించాలన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాంతంలో వారి కదలికలను తమ సిబ్బంది ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. తవ్వకాలు జరిగే అవకాశాలున్న ప్రదేశాల్లో 24 గంటలు తమ సిబ్బందిగస్తీ నిర్వాహణకు చర్యలు తీసుకుంటున్నామని రేంజ్ అధికారి వెల్లడించారు.
పెదవలస అటవీశాఖ రేంజ్ అఽధికారి
శివరంజిని హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment