ఘాట్ లోయలోట్యాంకర్ బోల్తా
జి.మాడుగుల: చింతపల్లి వెళ్లే మార్గంలో కొక్కిరాపల్లి ఘాట్లో గురువారం సాయంత్రం 3గంటల సమయంలో తారు ట్యాంకర్ లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. హైవే పనుల నిమిత్తం మైదాన ప్రాంతం నుంచి జి.మాడుగుల తారును తీసుకువచ్చి అన్లోడ్ చేసి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ట్యాంకర్లోని డ్రైవర్, క్లీనర్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment