ఏడు రోడ్లకు డీఎల్‌సీ ఆమోదం
● సత్వరం పనులు ప్రారంభించాలి ● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలో ఏడు రోడ్ల నిర్మాణానికి జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇంజినీరింగ్, రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో కలెక్టర్ దినేష్‌కుమార్ అధ్యక్షతన సోమవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఎల్‌సీలో ఆమోదం పొందిన మాడగడ నుంచి అరకురోడ్డు, డుంబ్రిగుడ మండలం గుల్లి నుంచి దబ్బగరువు, జోలగుడ నుంచి డుంబ్రిగుడ, లోతేరు నుంచి చెల్లుబడి, కటికి,తారాబు జలపాతాల రోడ్లు,కర్రిగుడ నుంచి చిన్నకోవెల రోడ్ల పనులను సత్వరం చేపట్టాలన్నారు. మారుమూల రహదారుల నిర్మాణాలకు గ్రామసభల అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అటవీ, రెవెన్యూ, ఇంజినీరింగ్‌శాఖల అధికారులు సంయుక్తంగా రహదారులపై సర్వే చేసి ఫారం–ఎలో అటవీశాఖకు పంపాలని,అలాగే అటవీశాఖ కూడా ఫారం–ఎను పరిశీలించి జాప్యం చేయకుండా ఫారం–బిలో అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు.సెల్‌టవర్ల నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తామన్నారు. ఈసమావేశంలో జేసీ అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, డీఆర్‌వో పద్మలత,గిరిజన సంక్షేమశాఖ ఈఈలు డేవిడ్‌రాజు,కె.వేణుగోపాల్,సబ్ డీఎఫ్‌వో ఉమామహేశ్వరి,వర్చువల్‌లో రంపచోడవరం,చింతూరు ఐటీడీఏ పీవోలు కట్టా సింహాచలం, అపూర్వభరత్, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్ష
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ ఎ.ఎస్ దినేష్‌కుమార్ సమీక్షించారు. మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన వన, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పౌర సరఫరాలు, ఎస్‌ఎంఐ సెరీకల్చర్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నైపుణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షించారు. అమరావతిలో ఈనెల 11, 12 తేదీల్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించనున్న సమావేశంలో చర్చించవలసిన అంశాలపై అధికారులతో ముందుగా సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు, సంక్షేమ పథకాల అమలు, రహదారుల నిర్మాణాలు, భవన నిర్మాణాలు, తాగునీటి పథకాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె.అభిషేక్‌గౌడ్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు కె.వేణుగోపాల్, జి.డేవిడ్‌రాజ్, రహదారులు భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌కుమార్‌రావు, సెరీకల్చర్ ఏడీ అప్పరావు, డీసీహెచ్‌ఎస్ కృష్ణరావు, డీఎల్‌పీవోపీ ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment