కాఫీ పండ్లు : రూ.44 పార్చ్‌మెంట్ గింజలు : రూ.285 అరబికా చెర్రీ : రూ.150 రోబస్ట చెర్రీ : రూ.80
ఈ ఏడాది అమ్మకాల అంచనా 18 వేల మెట్రిక్ టన్నులు
ఏడాదిలో మొత్తం లావాదేవీలు రూ.400 కోట్లు (అంచనా)
గత ఏడాది విక్రయం
17 వేల మెట్రిక్ టన్నులు
ఈఏడాది కూడా గిరిజన రైతులు ఉత్పత్తి చేసే కాఫీ పంటకు ఎఫెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ,పాడేరు ఐటీడీఏలు గిట్టుబాటు ధరలను ప్రకటించాయి.చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కాఫీ పండ్లకు కిలో రూ.44ధర చెల్లించేందుకు పాడేరు ఐటీడీఏ నిర్ణయించింది. పార్చ్‌మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285 ధరతో, అరబికా చెర్రీ రకాన్ని కిలో రూ.150,రోబస్ట చెర్రీ రకాన్ని కిలో రూ.80కు కొనుగోలు చేయనున్నారు. డ్రైకాఫీ దిగుబడి ఎకరాకు 150 కిలోల వరకు ఉంటుంది. ఐటీడీఏ ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి 45 వేల వరకు రైతుకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ. 8 కోట్లతో పండ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఐటీడీఏ నిర్ణయించుకోగా, రూ. 57 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని జీసీసీ భావిస్తోంది. జిల్లా మొత్తం ఈ ఏడాది రూ.400 కోట్ల వరకూ కాఫీ లావాదేవీలు జరగవచ్చని భావిస్తున్నారు.
జీసీసీ,ఐటీడీఏలు గిట్టుబాటు ధరలు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment