ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
సాక్షి, పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. అరకులోయ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకులోక పార్లమెంటు నియోజవర్గం పరిధిలో వినియోగించిన ఈవీఎంలను గోదాముల్లో భద్రపరిచారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గోదాములకు వేసిన సీళ్లు, తాళాలను తెరచి ఈవీఎంలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశామని పార్టీల ప్రతినిధులు గోదాముల వద్ద చేపట్టిన భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, పాడేరు తహసీల్దార్ వంజంగి త్రినాథరావు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, ఆమ్‌ఆద్మీరాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment