కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
● జి మాడుగులలో 10.7 డిగ్రీల నమోదు
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి, మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు అలుముకోవడంతో వాహన చోదకులు హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం జి.మాడుగులలో కనిష్టంగా 10.7 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో డుంబ్రిగుడలో 11.3, గూడెం కొత్తవీధిలో 11.3, చింతపల్లిలో 11.5, అరకువ్యాలీలో 12.0, హుకుంపేటలో 12.1, అనంతగిరిలో 13.0, పెదబయలులో 13.0, పాడేరులో 13.0 డిగ్రీలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. కొయ్యూరులో 14.7, ముంచింగుపుట్టులో 14.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన వివరించారు. .సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment