చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా బాధ్యతల స్వీకారం
చింతపల్లి: చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఏఎస్పీ)గా నవజ్యోతి మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. చింతపల్లి డీఎస్పీగా ప్రస్తుతం షేక్ షహబాజ్ అహ్మద్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఐదుగురు ఏఎస్పీలకు వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. 2021 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నవజ్యోతి మిశ్రా శిక్షణ ముగించుకుని ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆయనను చింతపల్లి ఏఎస్పీగా ప్రభుత్వం నియమించడంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు గంజాయి, మావోయిస్టు కార్యక్రమాలను అదుపు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను మెరుగుపరచడంతోపాటు గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు సీఐలు వినోద్‌బాబు, వరప్రసాద్, వెంకటరమణ, ఎస్సైలు వెంకటేశ్వరరావు, అప్పసూరి తదితరులు ఏఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment