ఎస్సీ, ఎస్టీలు విద్యుత్ బకాయిలు చెల్లించాలి
చింతపల్లి: చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీలు బకాయి పడ్డ విద్యుత్ బిల్లులను వెంటనే చెల్లించాలని విద్యుత్ శాఖ డివిజినల్ ఇంజినీర్ కోట్ల సన్ని రాంబాబు చెప్పారు. ఆయన గురువారం విద్యుత్‌శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 10 ఎకరాలు పొడి, 3 ఎకరాలు తడి భూమి కలిగి ఉంటే ఎస్సీ, ఎస్టీలు కూడా సబ్సిడీకి అర్హులు కాదన్నారు. ప్రభుత్వ సంస్థల్లో నెలకు 12 వేల ఆదాయం పైన ఉన్న వారు కూడా అర్హులు కాదన్నారు. ఇప్పటి వరకూ చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో 5,770 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందులో రూ.5 వేలు పైబడి బకాయి పడ్డ వినియోగదారులు 1074 మంది ఉన్నారన్నారు. వీరి నుంచి రూ.కోటి 74 లక్షల బకాయిలు రావల్సి ఉందన్నారు. విద్యుత్ వినియోగదారులు వెంటనే బకాయిలను చెల్లించాలన్నారు. తొలిగా నోటీసులు జారీ చేస్తామని, 15 రోజుల్లోగా బిల్లులు చెల్లించనట్లయితే విద్యుత్ కనక్షన్లను తొలగిస్తామన్నారు.
విద్యుత్ శాఖ డీఈ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment