గోపాలపట్నం: వ్యసనాలకు బానిసైన 19 ఏళ్ల కట్టోజి అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన 89వ వార్డు చంద్రానగర్‌లో జరిగింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ.. అజయ్, అతని తల్లి కామాక్షి చంద్రానగర్‌లో నివాసం ఉంటున్నారు. అజయ్ తల్లి బుధవారం తన స్వగ్రామమైన పార్వతీపురం వెళ్లింది. తనతో రావాలని ఆమె కోరినా అజయ్ నిరాకరించాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. అజయ్ 10వ తరగతి ఉత్తీర్ణుడై, పని లేకుండా తిరుగుతున్నాడు. అతనికి అక్క ఉంది. తండ్రి గతంలో మరణించాడు. వ్యసనాలకు బానిసైన అజయ్ డబ్బుల కోసం తల్లిపై దాడికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. తల్లి ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. తర్వాత తల్లి ఇచ్చిన జామీను ద్వారా బయటకు వచ్చాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment