జాతరలో చల్ చల్ గుర్రం!
చోడవరం : జిల్లాలో క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పోటీలు సంక్రాంతి తీర్ధాల్లో ప్రత్యేక ఆకర్షణ. గ్రామదేవతల పండగల వరకు అన్ని ఉత్సవాలు గుర్రాల జాతరను తలపిస్తాయి. కొందరు పోటీల కోసమే గుర్రాల పెంపకం చేపడుతుండడం విశేషం. జైపూర్ మహారాణి పాలనలో మాడుగులలో దసరా రోజున ప్రత్యేకంగా గుర్రాల సంత కూడా జరిగేది. ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు వెళ్లేందుకు మైదాన గిరిజన గ్రామాలకు చెందిన వారు నేటికీ గుర్రాలనే రవాణాకు ఉపయోగిస్తున్నారు. దీంతో మైదాన గిరిజన గ్రామాల్లో వీటి పెంపకం పెరిగింది. ప్రస్తుతం సంక్రాంతి తీర్థాలు కనుమ పండగ నుంచి ప్రారంభం కావడంతో గ్రామీణ తీర్థాల్లో గుర్రాల దౌడు మొదలైంది.
మైదానాలు రెడీ
చోడవరం, కొత్తకోట, దొండపూడి, టి.అ ర్జాపురం, రావికమతం, మాడుగుల, అ చ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం, కోటవురట్ల, రాంబిల్లితోపాటు రాజరిక కీర్తిని సంతరించుకున్న పద్మనాభం, ఎస్. కోట, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో గుర్రాల పరుగు పో టీలు జోరుగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా మేలు రకం గుర్రాల ధర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటుంది. అయినా సరే గుర్రాల పోటీలపై మక్కువతో పలువురు ఎంత ధరైనా చెల్లించి గుర్రాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాజస్థాన్, గుజరాత్, హైదరాబాద్, జైపూర్, కటక్ ప్రాంతాల నుంచి మేలు రకం గుర్రాలను కొనుగోలు చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
రేస్‌లు...ఇలా...
గుర్రాల పోటీలను మూడు రకాలుగా నిర్వహిస్తారు. పోటీకి వచ్చిన గుర్రాల సంఖ్యను బట్టి రెండు మూ డు గ్రూపులుగా విభజించి ఒకేసారి 5 నుంచి 7 గు ర్రాలను బరిలోకి దించి స్వారీ చేస్తారు. ముందుగా గమ్యం చేరిన గుర్రాలను వరుసగా గెలుపొందిన ట్టుగా ప్రకటిస్తారు. రెండో రకం పోటీలో రెండేసి గు ర్రాలను బరిలోకి దించి దౌడు తీయిస్తారు. గెలుపొందిన వాటికి మరలా పోటీపెట్టి తుది విజేతలను ప్రకటిస్తా రు. మూడో రకం పో టీల్లో ఒక్కో గుర్రాన్ని దౌడు తీయించి తక్కువ సమయంలో గమ్యాన్ని చేరిన గుర్రం గెలిచినట్టుగా ప్రకటిస్తారు.
నేటి నుంచి పోటీలు మొదలు...
ఈనెల 17వ తేదీ జిల్లాలో అతి పెద్ద పండగైన చోడవరం మండలం నర్సాపురం తీర్థ మహోత్సవం, బుచ్చెయ్యపేట మండలం రాజాం, ఆనందపురం గ్రామాల్లో పండగలు సందర్భంగా జిల్లా స్థాయి గుర్రాల పరుగుల పోటీని ఏర్పాటు చేశారు. ఈనెల 18న భోగాపురంలోను, 20న శీమునాపల్లి గ్రామాల్లో జిల్లా స్థాయి గుర్రాల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ప్రకృతి సాగు..
లాభాలు బాగు
–8లో
పరిశ్రమలు, కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు
సాక్షి, పాడేరు: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా పలు పరిశ్రమలు, కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.రోహిణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రూ.800 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. టెన్త్, పాలిటెక్నిక్, ఐటీఐ బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ చదివిన అభ్యర్థులు 21 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయస్సు లోపువారు అర్హులన్నారు. నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు స్టైఫండ్, పీఎం జీవన్‌జ్యోతి, బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 12 నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులలో ఎన్‌రోల్ కారాదని, ప్రభుత్వ ఉద్యోగం కూడా కలిగి ఉండకూడదన్నారు. ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులు చేస్తున్న వారు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదన్నారు.మరిన్ని వివరాలకు 9988853335, 8712655686, 8790117279 నంబర్లకు సంప్రదించాలని ఆమె కోరారు.
ఒకప్పుడు రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం జట్కా బళ్లే ప్రధాన రవాణా వాహనంగా ఉండేవి. మారిన కాలంలో జట్కా బళ్లు కనుమరుగైపోవడంతో కొంతకాలం గుర్రాల గిట్టల శబ్దాలు కనుమరుగుయ్యాయి. ఇప్పుడు మళ్లీ చల్ చల్ గుర్రం...చలాకీ గుర్రం... అంటూ గుర్రాలు పరుగులు తీస్తున్నాయి. రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన గుర్రపు స్వారీ, పరుగు పోటీలు ఇప్పుడు మరలా గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. కేవలం క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పోటీలు ఇటీవల కాలంలో గ్రామాల్లో జరిగే ప్రతి ఉత్సవాల్లో సందడి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment