● హుకుంపేటలో 10.1 డిగ్రీలు నమోదు
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దాంతో చలి, మంచు తీవ్రత అధికంగానే ఉంది. గురువారం హుకుంపేటలో 10.1 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణం విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో పాడేరులో 10.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.6, చింతపల్లిలో 10.8, జి.మాడుగులలో 11.1, ముంచంగిపుట్టులో 11.4, పెదబయలులో 11.8, జీకే వీధిలో 12.6, అనంతగిరిలో 13.4 డిగ్రీలు నమోదు కాగా కొయ్యూరులో 15 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపారు. ఉదయం 10 గంటల వరకు మంచు అధికంగా కురవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించారు. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తుండంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment