ఆటోలో బాలింత తరలింపు
అరకులోయ టౌన్: అరకులోయ ఏరియా ఆస్పత్రిలో ఈనెల 13న ప్రసవించిన బాలింతకు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ఇవ్వకపోవడంతో ఆటోలో స్వగ్రామానికి తరలించినట్లు సర్పంచ్ మాదల బుటికి తెలిపారు. మండలంలోని మారుమూల పాంత్రం ఇరగాయి పంచాయతీ ఉరుముల గ్రామానికి చెందిన కొర్రా పుష్పలతను స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరగా మారుమూల ప్రాంతానికి అంబులెన్స్ ఇవ్వలేమని ఆస్పత్రి వర్గాలు చెప్పాయన్నారు. బస్సు సౌకర్యంలేని గ్రామాల్లో బాలింతలకు అంబులెన్స్ ఇవ్వకపోవడం చాలా దారుణమని సర్పంచ్ బుటికి తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాము వివరణ కోరగా.. నలుగురిని దింపేందుకు అప్పటికే తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు వెళ్లాయని, ఆలస్యమవుతుందని, వేచి ఉండమని చెప్పామని, వారే ఆటో కట్టించుకొని వెళ్లిపోయారని వివరించారు.
అక్కరకు రాని తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్
Comments
Please login to add a commentAdd a comment