డాబాగార్డెన్స్(విశాఖ): పాత పెన్షన్ విధానం, 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఐక్యంగా ఉద్యమిద్దామని సిటూ అఖిల భారత కార్యదర్శి కేఎన్ ఉమేష్ పిలుపునిచ్చారు. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో సోమవారం డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో 8వ వేతన సంఘం ఏర్పాటు, ఓపీఎస్ సాధన కార్మిక వర్గ పాత్రపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏకీకృత పెన్షన్ విధానంపై దేశంలోనే తొలిసారిగా సదస్సు నిర్వహించిన విశాఖపట్నం డిఫెన్స్ కో ఆర్డినేషన్ కమిటీని అభినందించారు. దేశంలో త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ లబ్ధి పొందేందుకు ఏకీకృత పెన్షన్ విధానాన్ని ప్రకటించిందన్నారు. పెన్షన్ భిక్షం కాదని, కార్మికుల హక్క అని సుప్రీంకోర్టు విశదీకరించిందని, 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటాలు ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఏఐడీఈఫ్ మాజీ అదనపు కార్యదర్శి గుహతకుర్తా గుర్తు చేశారు. రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ డివిజన్ కార్యదర్శి బోలేనాఽథ్ మాట్లాడుతూ ఏకీకృత పెన్షన్ మాకు ఆమోదయోగ్యం కాదన్నారు. రాష్ట్ర సిటూ ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, టీఎన్టీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగార్జున, నేవల్ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జి.అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర కార్యవర్గం రద్దు
సాక్షి,పాడేరు: దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర కార్యవర్గ కాలపరిమితి ముగియడంతో రాష్ట్ర కమిటీని రద్దు చేస్తున్నట్టు ఈ సంఘ రాష్ట్ర సలహాదారుడు డాక్టర్ చెండా కేశవరావు ప్రకటించారు.విశాఖలోని గిరిజన భవన్‌లో ఉద్యోగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సమరెడ్డి మాణిక్యం,ప్రధాన కార్యదర్శి ఎల్.బి.కామేశ్వరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఉద్యోగ సమితి అధ్యక్షులు,ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.గత రెండున్నర ఏళ్లగా దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర కమిటీ విజయవంతంగా నిర్వహించిన ఆదివాసీల హక్కులు,చట్టాల పరిరక్షణ పోరాటాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంఘ సలహాదారుడు కేశవరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 15న సంఘ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment