● శబరిమల, పంచారామాలకు ప్రత్యేక బస్సులు
సాక్షి, అనకాపల్లి: కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణంగా ప్రతి ఏటా పంచారామాలకు వెళ్లే భక్తులు ఎక్కువమంది ఉంటారు. వీరి కోసం ఎప్పట్లాగే ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. శబరిమలకు కూడా స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఒకరోజులోనే పంచారామాల దర్శనం
కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి బస్సులు బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి సోమవారం రాత్రి డిపోలకు చేరుకుంటాయి. టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో, లేదంటే డిపో కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం.. వారు ప్రయాణించే చోటుకే బస్సు పంపే ఏర్పాట్లు చే స్తున్నారు.
ముందుగా బుక్ చేసుకోవచ్చు
కార్తీక మాసంలో ప్రతి ఆదివారం (ఈనెల 3, 10, 17, 24వ తేదీల్లో) అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి పంచరామాల పుణ్యక్షేత్రాలకు బస్సులు బయలుదేరుతున్నాయి. భక్తులు ముందుగానే ఆన్‌లైన్ అఫీషియల్ వెబ్‌సైటులో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదంటే అనకాపల్లి డిపోతో 7382913967 నంబరుకు, నర్సీపట్నం డిపోతో 9494811855 నంబరుకు సంప్రదించవచ్చు. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వాములు, భక్తుల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. డిపో మేనేజర్లను సంప్రదించి శబరిమల స్పెషల్ బస్సులు బుక్ చేసుకోవచ్చు.
– కె.పద్మావతి, ప్రజారవాణా శాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment