నదీ, సముద్ర తీరాల వద్ద భద్రతా ఏర్పాట్లు
● పుణ్యస్నానాలు చేసే చోట గజ ఈతగాళ్లు ● ఆలయాలు, వన భోజనాల వద్ద గస్తీ ● కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు
అనకాపల్లి : కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో జిల్లాలోని సముద్రతీర ప్రాంతాలకు, నదులకు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరిస్తారని దానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రాలు, నదీ తీరప్రాంతాల వద్ద కార్తీకమాసంలో భక్తుల సౌకర్యార్ధం గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ శాఖ హెచ్చరికలు, సూచనలను పాటిస్తూ క్షేమంగా స్నానాలను ఆచరించాలని భక్తులను ఆయన కోరారు. సోమవారాలు, ప్రధాన రోజుల్లో ఎక్కువ మంది భక్తులు శివాలయాలకు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసుస్టేషను పరిధిలోని దేవాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కార్తీక వన భోజనాలు నిర్వహించే ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఈవ్ టీజింగ్స్, చైన్ స్నాచింగ్స్, ఇతరత్రా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment