మున్సిపల్ కమిషనర్‌పై కలెక్టర్‌కు చైర్పర్సన్ ఫిర్యాదు
ఆవేదన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి
నర్సీపట్నం: ప్రొటోకాల్ పాటించని మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి కలెక్టర్ విజయకృష్ణన్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొన్నారు. స్వచ్ఛతాహీ సేవ బ్యానర్‌పై చైర్పర్సన్ ఫొటో ముద్రించకపోవడంతో ప్రొటోకాల్ ప్రకారం తన ఫొటో ఎందుకు ముద్రించలేదని కమిషనర్‌ను ఆమె నిలదీశారు. ఈ అంశాన్ని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో వి.వి.రమణ దృష్టికి ఆమె తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘించి తనను అవమానిస్తున్నారు. దళిత మహిళలను కాబట్టే అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించని మున్సిపల్ కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. మున్సిపాలిటీ ప్రథమ పౌరురాలైన తనకు కనీసం విలువ ఇవ్వడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment