గిరిజనుల వినూత్న నిరసన
●అదానీ హైడ్రో పవర్‌ప్లాంట్‌కు అనుమతులిస్తే ప్రతిఘటన
దేవరాపల్లి: అదానీ హైడ్రో పవర్‌ప్లాంట్‌కు అనుమతులిస్తే ప్రత్యక్ష ప్రతిఘటన తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి బి.టి.దొర హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని నగరంపాలెంలో హైడ్రో ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని గురువారం స్థానిక గిరిజనులతో కలిసి పరిశీలించారు. గిరిజనుల సంప్రదాయ ఆయుధం విల్లులు చేతపట్టి వినూత్న రీతిలో గిరిజనులతో కలిసి నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీపీఎం నేతలు వెంకన్న, దొర మాట్లాడుతూ ఫారెస్టు అధికారులు ఇటీవల అదానీ కంపెనీ ఏజెంట్లతో కలిసి రహస్యంగా సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్‌ప్లాంట్ వద్దని గత కొంతకాలంగా గిరిజనులు ఆందోళనలు చేస్తుంటే, రహస్య సర్వే ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. నగరంపాలెం గ్రామానికి జల్‌జీవన్ మిషన్ పథకంలో మంచినీటి పనులకు నిధులు మంజూరు చేస్తే, ఫారెస్టు ఏరియా ఉందని అడ్డగించిన అటవీశాఖ అధికారులు దట్టమైన ప్రాంతాన్ని అదానీకి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. అదానీ కన్ను రైవాడ, కోనాం ప్రాజెక్టులపై పడిందని, జలాశయాలను కాపాడుకునేందుకు ఆయకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్‌ప్లాంట్ నిర్మించాలంటే గిరిజనుల అనుమతితోపాటు గ్రామసభ తీర్మానం అవసరమన్నారు. పీసా, అటవీ హక్కులు, 1/70 తదితర చట్టాలను ధిక్కరించి ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment