రీసర్వే అభ్యంతరాలపై పూర్తి స్థాయి విచారణ
● బెల్ట్ షాపులపై కఠిన చర్యలు ● కలెక్టర్ ఆదేశం
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: రెవెన్యూ గ్రామ సభల్లో రీసర్వే అభ్యంతరాలపై వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఎకై ్సజ్, మైన్స్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ గ్రామ సభల్లో వచ్చిన అర్జీలపై తహసీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమస్యల పరిష్కారానికి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం షాపులపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బెల్ట్ షాపులు నిర్వహించకుండా అరికట్టాలని, అందుకు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, మైనింగు, ఎకై ్సజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment