పేకాట పోలీసులపై ఎస్పీ ఆరా!
● తప్పు ఒప్పుకోవాలని ఆదేశం ● లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరిక ● ఆ సీఐ, ఎస్‌ఐ గుండెల్లో రైళ్లు
సాక్షి, అనకాపల్లి: పేకాట శిబిరాలపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్న నగదులో సగం నొక్కేసిన ఖాకీల వ్యవహారం ఇప్పుడు జిల్లా పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిపై ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందు పోలీసులు పలు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు. ఇందులో రూ.24 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదులో రూ.12 లక్షలు మాత్రమే చూపించి.. మిగిలిన రూ.12 లక్షలను ఒక సీఐ, ఎస్‌ఐ నొక్కేశారు. సాక్షి ప్రచురించిన కథనంతో ఎస్పీ తుహిన్ సిన్హా ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలిసింది. పేకాటరాయుళ్ల నుంచి సొమ్ము నొక్కేసిన వారి కోసం విచారిస్తున్నట్లు సమాచారం. తప్పు చేసిన వారు ఒప్పుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఇప్ప టికే హెచ్చరికలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు సీఐ, ఎస్‌ఐ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు తె ర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment