సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
నర్సీపట్నం: విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంతవాసులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. రూ.67.35 కోట్లతో నిర్మించే 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను 220 కేవీ స్థాయికి పెంచడం వల్ల జిల్లాలోని ఆరు మండలాల్లో 175 గ్రామాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూడు మండలాల్లో 369 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ లభ్యం కావడం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. జెడ్పీటీసీ రమణమ్మ, కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.విజయ్ మాట్లాడారు. ఏపీఈపీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బి.శ్యామ్‌ప్రసాద్, ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ, తహసీల్దార్ రామారావు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment