అంగన్‌వాడీల నిరసన గళం
● హామీలు అమలు చేయాలని డిమాండ్
నెహ్రూచౌక్ వద్ద అంగన్‌వాడీ కార్మికుల నిరసన
అనకాపల్లి: మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్పు చేయాలని, మెయిన్ వర్కర్స్‌తో సమానంగా మినీ అంగన్‌వాడీ వర్కర్స్‌కు జీతాలు చెల్లించి, ప్రమోషన్లు కల్పించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నెహ్రూచౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, శనివారం ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. గతంలో 42 రోజుల సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు మాట్లాడారు. యూనియన్ జిల్లా నాయకులు జి.రామలక్ష్మి, కె.పార్వతి, వరలక్ష్మి, తనూజ, అంజలి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment