ప్రతి వేతనదారునికి 100 రోజుల పని దినాలు
● డ్వామా పీడీ పూర్ణిమాదేవి
కె.కోటపాడు: ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి వేతనదారుడికి 100 రోజుల పనిదినాలను కచ్చితంగా కల్పించాలని డ్వామా ప్రాజెక్ట్ అధికారి, మండల ప్రత్యేకాధికారి ఆర్.పూర్ణిమాదేవి తెలిపారు. కె.కోటపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందితో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో జరిగే ఉపాధి పనుల పరిశీలనను మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె పరిశుభ్రత పనుల్లో పాల్గొన్నారు. స్థానిక హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని పూర్ణిమాదేవి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, సూపరింటెండెంట్ ఎస్.అప్పలరాజు, ఎంఈవో సత్యనారాయణ, డీవీడీ.ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ సుమతి, ఏపీవో అప్పలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment