వ్యర్థాల రీసైక్లింగ్‌తో పర్యావరణ అనుకూల అభివృద్ధి
పాయకరావుపేట: వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తేనే పర్యావరణ అనుకూల అభివృద్ధి సాధ్యమవుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. పర్యావరణ సమస్యలు – సుస్థిర అభివృద్ధి అనే అంశం పై స్పేసెస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక, మానవ అభివృద్ధితో పాటు పర్యావరణ వృద్ధి కూడా జరిగితేనే సమగ్ర అభివృద్ధిగా భావించాలని, దీని కోసం వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ అభివృద్ధి చేయాలన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధనమైన సౌరశక్తి, పవనశక్తి, హైడ్రోజన్ ఇంధన శక్తిని ఉపయోగించాలని తెలిపారు. వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యువత ముందుకు రావాలని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించవలసిన బాధ్యతను కూడా యువత తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ కంటిపూడి నరేంద్రబాబు, శాస్త్రవేత్త ఎల్.నగేష్, సంయుక్త కార్యదర్శి సీహెచ్.విజయ్ ప్రకాష్, ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment