ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు 40 అర్జీలు వచ్చాయని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. అర్జీదారుల నుంచి సమస్యలు తెలుసుకుంటూ ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్్, ఇతర సమస్యలపై ఎక్కువగా అర్జీలు అందాయన్నారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment